New Zealand special ODI jersey: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య క్రీడా బంధం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో భారత జట్టుతో జరగనున్న వన్డే (ODI) సిరీస్ కోసం కివీస్ ఆటగాళ్లు ఒక ప్రత్యేకమైన, లిమిటెడ్ ఎడిషన్ జెర్సీని ధరించనున్నారు. 'కోతాహితంగా' (Kotahitanga) పేరుతో రూపొందించిన ఈ జెర్సీలో భారతీయ సంస్కృతి, ఆచారాలు, మావోరీ (Māori) సాంప్రదాయ కళారూపాలను అత్యంత అద్భుతంగా సమ్మేళనం చేశారు. ఈ ప్రత్యేక జెర్సీని ప్రఖ్యాత ఆర్టిస్టులు బెన్ థామసన్, శివ్ నారందాస్, జై పంచాలు కలిసి రూపొందించారు.
భారతీయ సంప్రదాయ డిజైన్లతో ప్రత్యేక జెర్సీ:
* భారతీయ కళారూపాలు: ఈ జెర్సీ డిజైన్‌లో భారతదేశ జాతీయ పుష్పమైన తామర (Lotus), భారతీయ వాస్తుశిల్పం నుంచి సేకరించిన ఓగీ (Ogee) ప్యాటర్న్, సమరూపతను ప్రతిబింబించే మండలా (Mandala) ఆర్ట్‌ను ఉపయోగించారు.
* మావోరీ సంస్కృతి: న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ 'కోవైవై' (Kowhaiwhai) పెయింటింగ్ శైలిని, హేహే (Haehae) గీతలను జోడించి, రెండు దేశాల సంస్కృతుల మధ్య ఉన్న అనుబంధాన్ని, గౌరవాన్ని ఆవిష్కరించారు.
రెండు సంస్కృతుల కలయిక:
న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లే మాట్లాడుతూ.. ఈ డిజైన్ పట్ల మేము ఎంతో సంతృప్తిగా ఉన్నాం.. కళాకారులు మావోరీ, భారతీయ సంస్కృతుల మధ్య అద్భుతమైన సమతుల్యతను తీసుకువచ్చారు. క్రీడలు రెండు దేశాల మధ్య ఐక్యతను చాటుతాయి.. ఈ జెర్సీ అభిమానులకు ఒక గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుందని పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన భారతీయ సంతతికి చెందిన డిజైనర్ శివ్ నారందాస్ మాట్లాడుతూ.. తమ మూలాలు కలిగిన దేశ సంస్కృతిని క్రికెట్ జెర్సీపై ఆవిష్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్:
* T20I 1వ T20I అక్టోబర్ 22, 2026 హ్యాగ్లీ పార్క్ సౌత్, క్రైస్ట్‌చర్చ్
* T20I 2వ T20I అక్టోబర్ 24, 2026 హ్యాగ్లీ పార్క్ సౌత్, క్రైస్ట్‌చర్చ్
* T20I 3వ T20I అక్టోబర్ 27, 2026 హెన్రీ స్టేడియం, వెల్లింగ్టన్
* T20I 4వ T20I అక్టోబర్ 30, 2026 ఈడెన్ పార్క్, ఆక్లాండ్
* T20I 5వ T20I నవంబర్ 1, 2026 సెడాన్ పార్క్, హామిల్టన్
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్:
* తొలి వ వన్డే నవంబర్ 4, 2026 ఈడెన్ పార్క్, ఆక్లాండ్
* రెండవ వన్డే నవంబర్ 7, 2026 హెన్రీ స్టేడియం, వెల్లింగ్టన్
* మూడో వన్డే నవంబర్ 10, 2026 సెడాన్ పార్క్, హామిల్టన్
* నాలుగవ వన్డే నవంబర్ 13, 2026 బే ఓవల్, టౌరంగ
* ఐదో వన్డే నవంబర్ 15, 2026 బే ఓవల్, టౌరంగ
భారత్ వర్సెస్ కివీస్ టెస్ట్ సిరీస్:
* ఫస్ట్ టెస్ట్ నవంబర్ 19–23, 2026 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్
* రెండో టెస్ట్ నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 హ్యాగ్లీ పార్క్ సౌత్, క్రైస్ట్‌చర్చ్
