
వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆద్యంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 49 ఓవర్లలో 242 పరుగులు చేసి విక్టరీని సొంతం చేసుకుంది. స్కిప్పర్ విలియమ్సన్ సెంచరీతో రాణించాడు.చివరి ఓవర్ లో 8 పరుగులు రావలసి ఉండగా తొలి బంతికి సాత్నర్ సింగిల్ తీశాడు. రెండో బంతిని విలియమ్సన్ సిక్సర్ బాదాడు. దీంతో అతడి సెంచరీ పూర్తయ్యింది. మూడో బంతికి ఫోర్. దీంతో మరో మూడు బంతులు మిలిగి ఉండగానే న్యూజిలాండ్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కు 242 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.
దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ భరిత పోరులో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అజేయ సెంచరీతో రాణించిన విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. విలియమ్సన్ 138 బంతుల్లో 1 సిక్సర్ 9 ఫోర్లతో 106 పరుగులు చేశాడు.