
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇవాళ జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది. 80 రన్స్ తేడాతో కివీస్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 రన్స్ చేసింది. వన్డే సిరీస్ ను కోల్పోయిన ప్రతీకారాన్ని ఈ మ్యాచ్ లో చూపించారు న్యూజిలాండ్ ప్లేయర్లు. భారత బౌలర్లను చితగ్గొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్.. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఓపెనర్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. అతనికి మన్రో, విలియమ్సన్ తోడవడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్స్‌లు, 14 ఫోర్లు నమోదు కావడం విశేషం.
220 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మంచి ప్రారంభం దక్కలేదు. 18 పరుగుల దగ్గర ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ధావన్ కాసేపే సిక్సర్లతో మెరిశాడు. 51 రన్స్ దగ్గర ధావన్ కూడా ఔట్ కావడంతో..వరుసగా వికెట్లు పెవిలియన్ కు చేరాయి. చివర్లో ధోనీ, కృనాల్ పోరాటం చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. 19 ఓవర్లలో 10 వికెట్లకు 139 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. మూడు టీ20ల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 లీడ్ లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 8న ఆక్లాండ్ లో జరగనుంది.
మ్యాచ్ హైలైట్స్ ఇవే..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. న్యూజిలాండ్ ఓపెనర్ సీఫ్రెట్..84 రన్స్
న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌధీ-3 వికెట్లు
పెర్గుసన్, సార్ట్నర్, ఇష్ సౌదీ తలో 2 వికెట్లు
భారత్..
హార్థిక్ పాండ్యా-2 వికెట్లె
భువి, ఖలీల్, కృనాల్, చహాల్ తలో 1 వికెట్ తీశారు
భారత్ బాట్స్ మెన్లలో.. కృనాల్(20), ధావన్(29), శంకర్(27), ధోనీ(39) ఎక్కువ రన్స్ చేశారు.
1st T20I. It's all over! New Zealand win by 80 runs https://t.co/gSsEqtOtkU #NZvInd #TeamIndia
— BCCI (@BCCI) February 6, 2019