పరువు కోసం నవ దంపతులను నరికి చంపారు..

పరువు కోసం నవ దంపతులను నరికి చంపారు..

కొత్తగా పెళ్లైన దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడు లోని తుత్తుకుడి జిల్లా కులాతూర్ గ్రామంలో జరిగింది. కొంత కాలంగా సోలైరాజ్, పెచియమ్మల్ లు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెండ్లికి ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. వీరిద్దరూ.. ఎస్సీ కులానికి చెందినవారు. కాగా.. ఉపకులాలు వేరుగా ఉన్నాయి. సోలైరాజ్ ఎస్సీలోని పారయ్యార్ వర్గానికి చెందినవాడు… చియమ్మల్ ఎస్సీ కులానికి చెందిన పల్లర్ వర్గానికి చెందిన యువతి. అయితే..పెద్దలు వారి పెండ్లికి అంగీకరించకపోవడంతో… రెండునెలల క్రితం సోలైరాజ్, పెచియమ్మలు ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.

గురువారం సాయంత్రం సోలైరాజ్, పెచియమ్మల్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పరువు హత్యగా భావిస్తున్నారు. వీరి హత్య వెనుక పెచియమ్మాల్ కుటుంబం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.