పాట్నా: బిహార్‌లో గెలిచేదాకా విశ్రమించేదిలేదని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తెలిపారు. బుధవారం ఎన్డీటీవీతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. బిహార్ ఎన్నికల్లో పార్టీ ఓటమి, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్‌కి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘ఇకపై వ్యూహకర్తగా పనిచేయను. ఫోకస్ మొత్తం బిహార్ పైనే పెడతా. బిహార్‌లో గెలిచేదాకా విశ్రమించను.. అది ఐదేండ్లు కానీ, పదేండ్లు కానీ.. ఈ విషయంలో నా ఆలోచనలను మార్చుకోను. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్తాను. కానీ నా పార్టీలోకి మాఫియా లీడర్లకు చోటివ్వను” అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
