మహువా మొయిత్రా కేసు విచారణ..ఎథిక్స్ కమిటీ మీటింగ్​ వాయిదా

మహువా మొయిత్రా కేసు విచారణ..ఎథిక్స్ కమిటీ మీటింగ్​ వాయిదా
  •     మీటింగ్​ రీషెడ్యూల్​ చేసిన లోక్​సభ సెక్రటేరియెట్

న్యూఢిల్లీ :  డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను విచారిస్తున్న లోక్​సభ ఎథిక్స్​కమిటీ తరువాతి మీటింగ్ రీషెడ్యూల్ అయింది. ఈ మేరకు 7న(మంగళవారం) జరగాల్సిన మీటింగ్​ను ఈ నెల 9న నిర్వహించనున్నట్లు లోక్​సభ సెక్రటేరియెట్ నోటీసు జారీ చేసింది. రీషెడ్యూల్ చేయడానికి అధికారికంగా కారణా లు వెల్లడించలేదు.

అయితే ఈ నెల 2న జరిగిన విచారణకు సంబంధించిన ముసాయిదా నివేదికను ఆమోదించేందుకు ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది. ముసాయిదా నివేదికను ఆమోదించడం అంటే ఎథిక్స్​ కమిటీ తన విచారణను ఇప్పటికే ముగించిందని అర్థం. 9న నిర్వహించనున్న మీటింగ్​లో గత విచారణలో ప్యానెల్ సభ్యులు వెల్లడించిన అభిప్రాయలను నమోదు చేసి నివేదికను లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాకు పంపిస్తారు. కాగా, కమిటీలోని మెజారిటీ బీజేపీ మెంబర్లు మొయిత్రాకు వ్యతిరేకంగా సిఫార్సు చేసే అవకాశం ఉంది.