- డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది స్వప్న హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ హత్యపై తక్షణమే పూర్తి విచారణ చేపట్టాలని డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. మహిళ న్యాయవాది హత్యకు కారకులైనవారిని శిక్షించాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.
మరొకసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. విచారణ ఆధారంగా బాధ్యులపై తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను నాలుగు వారాల్లోపు కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.
