రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

కర్ణాటక: రాష్ట్రంలోని బెంగుళూర్ రామేశ్వరం కేఫ్ లో మార్చి 1న సంభవించిన బాంబ్ పేలుడు కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ గురువారం కీలక నిందితున్ని అరెస్ట్ చేసింది. కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట మొత్తం 18 ప్రాంతాల్లో ఈరోజు NIA  దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్ ను అరెస్ట్ NIA అరెస్ట్ చేసింది. 

షరీఫ్ మరో ఇద్దరు నేరస్తులకు పేలుడ పదార్థాలు సమకూర్చుడం, టెక్నికల్ సహాయం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ రైడ్స్ లో పలు ఎలక్ట్రానిక్  పరికరాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు NIA  తెలిపింది. ఇప్పటి వరకూ ఈ కేసులో NIA  ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇంకా దర్యాప్తు చేస్తోంది. ప్రధాన సూత్రధారులు సాజీబ్, అబ్దుల్, హుస్సేన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. రామేశ్వరం పేలుడు వెలుక భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ తెలిపింది.