ఉప్పల్ చిలుకానగర్ లో ఎన్ఐఏ సోదాలు

ఉప్పల్ చిలుకానగర్ లో ఎన్ఐఏ సోదాలు

ఉప్పల్ చిలుకా నగర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏక కాలంలో మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నమోదైన మిస్సింగ్ కేసులో భాగంగా హైకోర్ట్ అడ్వకేట్ శిల్ప ఇంటిపై NIA అధికారులు రైడ్ చేశారు. కొద్ది రోజుల క్రితం రాధ అనే మెడికల్ స్టూడెంట్ పై ఏపీలోని విశాఖ పట్నంలో మిస్సింగ్ కేసు నమోదైంది. మూడున్నరేళ్ల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. అయితే రాధను నక్సల్స్ లో చేర్చారని శిల్పపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా NIA కేసు నమోదు చేసింది. అడ్వకేట్ శిల్పా ఇంటితో పాటు, సీఎంఎస్ నేత దేవేంద్ర, అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు బండి కిరణ్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. 

తన కూతురిని బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి అంటున్నారు. 2017లో వైద్యం పేరుతో దేవేంద్ర తన కూతురిని తీసుకెళ్లాడని ఆరోపించారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదన్నారు. 2018 నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి ఉదయ్, అరుణతో కలిసి ఏవోబీలో పనిచేస్తుందని రాధ తల్లి తెలిపారు. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి పేరు కూడా ఎఫ్ఆర్ లో నమోదు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు.