
దుబాయ్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై ఐసీసీ బుధవారం నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించింది. అంతేకాక ఐదు డీమెరిట్ పాయింట్లు ఇచ్చిన బోర్డు.. బహిరంగ క్షమాపణ చెప్పాలని పూరన్‌ను ఆదేశించింది. అఫ్గాన్‌తో మ్యాచ్ సందర్భంగా పూరన్ తన చేతి బొటన వేలి గోరుతో బాల్‌ను గీరాడు. పూరన్ ఆ పనిని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఇందుకు సంబంధించిన వీడియోలో క్లియర్‌గా అర్థమైంది. మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ మంగళవారం చేపట్టిన విచారణలో పూరన్ కూడా తప్పును అంగీకరించాడు.