‘ది రాజా సాబ్’ సినిమా కోసం మూడేళ్లు పడ్డ కష్టానికి ప్రేక్షకులు చక్కని విజయాన్ని ఇచ్చారని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పింది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆమె బెస్సీ అనే పాత్రలో నటించింది. ఇటీవల సినిమా విడుదలైన నేపథ్యంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ ‘‘తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని హీరో దైవికంగా ఎదుర్కోవడాన్ని మారుతి గారుకొత్తగా చూపించారు. కథ చెప్పగానే ఆ పాయింట్ యూనిక్‌గా అనిపించింది. ఇక బెస్సీ పాత్ర కోసం చాలా ప్రిపరేషన్స్ చేశాం.
ముఖ్యంగా డ్రెస్ విషయంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఏంజెల్ తరహా రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ప్రభాస్ గారితో వర్క్ చేయడం ప్లెజర్‌గా ఫీలయ్యా. ఆయనో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడూ అనుకోరు. సరదాగా కలిసిపోయేవారు.
పవన్ కళ్యాణ్ గారితో ‘హరి హర వీరమల్లు’లో నటించినప్పుడు ఆయన ధైర్యం చూసిపవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఇక ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా” అని చెప్పింది.
