నిలోఫర్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్

నిలోఫర్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి నుంచి సెప్టెంబర్ 14న కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మహిళ కిడ్నాపర్ నుంచి ఆరు నెలల బాలుడిని పోలీసులు రక్షించారు. నిలోఫర్ నుంచి బాన్సువాడకు మహిళ కిడ్నాపర్, ఆమె భర్త ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ కుమారుడి ఆరోగ్యం బాగాలేని కారణంగా నిలోఫర్ వచ్చామని.. అక్కడే ఈ బాబుని చూశామని కిడ్నపర్ దంపతులు చెప్పారు. బాలుడిని పెంచుకోవడానికే కిడ్నాప్ చేశామని వెల్లడించారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలుడిని త్వరలోనే అతడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాలుడిని పోలీసులు రక్షించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 

ALSO READ : ఏడేళ్ల పిల్లోడు.. ఐదేళ్ల పాపను అత్యాచారం చేశాడా.. ? పోలీసులు ఏం చెబుతున్నారంటే..!

ఇక, ఆసుపత్రిలో బాలుడి తల్లి ఫరీదా బేగంతో స్నేహం చేసిన మహిళ పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న ఫరీదా బంధువుల సమక్షంలో ఆమె నుంచి నిందితురాలు బాలుడిని తీసుకుంది. అయితే ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఫరీదా ఆమె బంధువులు బాలుడి కోసం, మహిళ కోసం ముమ్మరంగా వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లి ఫరీదాకు మాయమాటలు చెప్పి నిందితురాలు ఈ కిడ్నాప్ చేసిందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. 

ఏం జరిగిందంటే..

నీలోఫర్‌ ఆస్పత్రిలో సెప్టెంబర్ 14వ తేదీన 6 నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. బాలుడి తల్లితో మాటలు కలిపిన ఓ మహిళ.. నమ్మించి మోసం చేసింది. ఆమె వార్డులోకి వెళ్లొచ్చేసరికే పిల్లాడిని తీసుకొని పారిపోయింది. బాలుడు కనిపించకపోయే సరికి ఆందోళనతో ఆస్పత్రి అంతా గాలించిన తల్లి.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. గురువారం (సెప్టెంబర్ 14) సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.