పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ప్రధాన ద్వారం గురువారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టర్ ప్రొ.బీరప్ప తెలిపారు. ప్రధాన ద్వారం ముందు భాగంలో వాటర్ వర్క్స్ అధికారులు కొత్త పైప్‌లైన్ కోసం తవ్వకాలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తవ్వకాల వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతున్నందున, రోగులు, వారి సహాయకులు, హాస్పిటల్ సిబ్బంది నేటి నుంచి బంజారాహిల్స్ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్‌లు సైతం బంజారాహిల్స్ ద్వారం నుండే రాకపోకలు సాగించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

