గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృతి

గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృతి

పంజాబ్‌లోని లూథియానాలో విషాదం చోటుచేసుకుంది. గియాస్‌పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైంది. ఏప్రిల్ 30 ఆదివారం రోజున ఉదయం జరిగిన ఈ  ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది, 

గ్యాస్ లీకేజీకి కారణమేమిటో తెలియరాలేదు.రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి,  అగ్నిమాపక అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్  ట్వీట్ చేశారు.  

"లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. వారు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు" అని మన్ పంజాబీలో ట్వీట్ చేశారు.