మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. అనారోగ్య కారణంగా ఆయన తల్లి తారకమ్మ(105) సోమవారం వనపర్తిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు నిరంజన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయినందుకు కుటుంబ సభ్యులు రోధించారు. మృతదేహాన్ని నిరంజన్‌రెడ్డి స్వగ్రామమైన పాన్‌గల్‌ మండలంలోని కొత్తపేటకు సాయంత్రం 3గంటలకు ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి సాయంత్రం 4గంటలకు ఖననం చేయనున్నారు.