నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నితిన్ హీరోగా నాని సమర్పణలో  తెరకెక్కుతోన్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఓ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ మినహా షూటింగ్ పూర్తి కావచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నాయి.  ఈ క్రమంలో శుక్రవారం రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 4న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నితిన్ మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించాడు.

చెక్స్ షర్ట్, ఫార్మల్ ట్రౌజర్స్, కళ్లద్దాలు పెట్టుకుని, భుజానికి బ్యాగ్ తగిలించుకుని కోర్టు ప్రాంగణంలో జనాల మధ్య నిలబడి ఉన్నాడు.  వెనుక న్యాయవాదులు, పోలీసులు కనిపిస్తున్నారు. ఆయన ముఖంలోని ప్రశాంతతతో పాటు ఏదో కొత్త పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తిలా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో   కృష్ణ  అనే సాధారణమైన యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే కృష్ణకు కొన్ని నిజాలను బయటపెట్టకుండా ఉండటం మంచిదనే పరిస్థితులు ఎదురవుతాయి.  

అలాంటి సమయంలో అతడి జీవితంలోకి ప్రేమ ప్రవేశిస్తుంది. అనుకోకుండా బయటపడిన ఓ రహస్యం అతను నమ్మిన ప్రతిదాన్నీ తలకిందులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ  దాగి ఉన్న నిజాల చుట్టూ సాగే ఈ కథ.. సమాజం అంగీకరించే విషయాలకు, ప్రశ్నించాలనుకునే అంశాలకు మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించనుంది అని మేకర్స్ తెలియజేశారు. విజయ్ బుల్గానిన్ ఈ  చిత్రానికి  సంగీతం అందిస్తున్నాడు.