
- మోదీ ప్రభుత్వంలో టెర్రరిజాన్ని సహించేది లేదు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో టెర్రరిజాన్ని సహించేది లేదని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టులు జైలుకు వెళతారు.. లేదంటే నరకానికి పంపిస్తామని హెచ్చరించారు. బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
టెర్రరిస్టులు ఎప్పటికీ విజయం సాధించలేరని, వారి కార్యకలాపాలు త్వరలోనే ముగుస్తాయన్నారు. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో 28 మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆ కాల్పుల్లో మన సైనికులు కూడా కొందరు మరణించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.