పదేళ్లు పూర్తి చేసుకున్న నివేదా పేతురాజ్.. మెగా సెట్స్లో సెలబ్రేషన్స్‌‌

 పదేళ్లు పూర్తి చేసుకున్న నివేదా పేతురాజ్..  మెగా సెట్స్లో సెలబ్రేషన్స్‌‌

తెలుగు,  తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటన, ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నివేదా పేతురాజ్.  గత రెండేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న ఆమె.. శుక్రవారం విడుదలైన ‘సింగ్‌‌ గీతం’ చిత్రంలో మెరిసింది. సినిమాకు ఎంతో కీలకమైన ప్లాష్‌‌బ్యాక్ సీన్స్‌‌లో శైలజమ్మ అనే ఇంపార్టెంట్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో మెప్పించింది.  

మరోవైపు చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల పూర్తయిన పొలాచ్చి షెడ్యూల్‌‌లో నివేదా పాల్గొంది. ఇక ఆమె హీరోయిన్‌‌గా పరిచయమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ సెట్స్‌‌లో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్‌‌ నిర్వహించారు. 

2016లో ‘ఒరు నాల్ కూతు’ అనే తమిళ చిత్రంతో నివేదా హీరోయిన్‌‌గా పరిచయం కాగా ఈ నెల 9తో ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. ఇక 2017లో ‘మెంటల్ మది’లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా.. చిత్రలహరి,  బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్‌‌, దాస్‌‌ కా ధమ్కీ చిత్రాలతో ఆకట్టుకుంది.