ముందుగా కేసీఆర్కు కేటీఆర్ సంస్కారం నేర్పాలె : బీజేపీ ఎంపీ అర్వింద్

ముందుగా కేసీఆర్కు కేటీఆర్ సంస్కారం నేర్పాలె : బీజేపీ ఎంపీ అర్వింద్

ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై నిజామాబాద్​ బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మెదట తమ తండ్రి కేసీఆర్ కు కేటీఆర్ సంస్కారం నేర్పాలన్నారు. తమ తండ్రి డీ. శ్రీనివాస్ తనకు సంస్కారం నేర్పాడన్నారు. సీఎం కేసీఆర్ కు సంస్కారం నేర్పిన ఇద్దరు.. ముగ్గురిలో తానూ ఒకడినని చెప్పారు. తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. వైన్స్ టెండర్లకు మాత్రం తెలంగాణలో ఎలాంటి సమస్య ఉండదన్నారు. రాష్ట్రంలో డబుల్​ బెడ్రూమ్​ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్​చేస్తూ..హైదరాబాద్​ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు చేపట్టిన మహాధర్నాలో ఎంపీ అర్వింద్​పాల్గొని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ కవిత నోటిఫికేషన్లపై  కూడా సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు గృహనిర్మాణ శాఖనే లేదని, ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరు కడుతారని ప్రశ్నించారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారని, కులం సర్టిఫికెట్ తీసుకోవాలంటే దాదాపు 30 రోజుల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు.. అర్హులైన వాళ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకుంటారని ప్రశ్నించారు.