హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థులకు కేంద్రం అందించే 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్)' రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 1న రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు.
7వ తరగతిలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం సర్కారు స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లు పరీక్షకు అర్హులని వెల్లడించారు. పేరెంట్స్ వార్షిక ఆదాయం రూ. 3.50 లక్షల లోపున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
