కార్డు లేకుండా ATM నుంచి డబ్బులు డ్రా ఎలా ? 

కార్డు లేకుండా ATM నుంచి డబ్బులు డ్రా ఎలా ? 

భారతదేశంలో యూపీఐ (UPI) పేమెంట్స్ రోజురోజుకు అధికమౌతున్నాయి. డిజిటల్ లావాదేవీలు కూడా పెరిగిపోతున్నాయి. ఏటీఎం (ATM) లకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కరోనా వైరస్ కారణంగా.. బ్యాంకులకు వెళ్లకుండానే..ఉన్న చోటు నుంచే డబ్బులను పంపిస్తున్నారు. మనీ ట్రాన్స్ ఫర్ చేయడంతో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. కానీ.. ఏటీఎంలలో మోసాలు జరుగుతుండడం.. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ఎన్సీఆర్ కార్పొరేషన్ గుర్తించింది. వీటికి చెక్ పెట్టాలని తాజాగా నిర్ణయించింది. యూపీఐ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ తో కలిసి ఇంటర్ అపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా (ICCW) సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకొంటోంది. అంటే.. కార్డు లేకుండానే... ఏటీఎం సెంటర్లలో డబ్బులను విత్ డ్రా చేసుకొనే అవకాశం త్వరలోనే రానుంది. గూగుల్ పే (Googlepay), పేటీఎం (Ptm), ఫోన్ పే (Phonepay)తో పాటు ఇతర యూపీఐ (UPI)లతో మనీ విత్ డ్రా చేసుకొనే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. 

మనీ విత్ డ్రా ఎలా చేయాలి . 

  • ఏటీఎం మిషన్ లో విత్ డ్రా క్యాష్ ఆప్షన్ ను ముందుగా సెలక్ట్ చేసుకోవాలి. 
  • యూపీఐ ఆప్షన్ ను ట్యాప్ చేయాలి. 
  • ట్యాప్ చేసిన అనంతరం ఏటీఎం స్క్రీన్ పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. 
  • ఆ కోడ్ ను యూపీఐ పేమెంట్ ద్వారా స్కాన్ చేసుకోవాలి. 
  • మనీ ఎంత డ్రా చేయాలని అనుకుంటున్నారని అడుగుతుంది. మీకు ఎంత కావాలో అక్కడ టైప్ చేయాలి. 
  • హింట్ ప్రాసెస్ బటన్ క్లిక్ చేసిన అనంతరం మనీ విత్ డ్రా అవుతుంది. 
  • అయితే.. లిమిట్ రూ. 5 వేల వరకు ఉంటుందని సమాచారం. 
  • డీఫాల్ట్ గా యూపీఐ అకౌంట్ క్లోజ్ అవుతుంది.