శ్రీలంక ఆటగాళ్లకు IPL 2021 వేలంలో నో ఛాన్స్

శ్రీలంక ఆటగాళ్లకు IPL 2021 వేలంలో నో ఛాన్స్

ఈసారి IPL 2021 వేలంలో ఒక్క శ్రీలంక ఆటగాడినీ తీసుకోకపోవడంపై ఆ దేశ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేలా జయవర్దనే స్పందించారు. అయితే, వీరిద్దరూ భిన్న స్వరాలు వినిపించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో లంక జట్టుకు కచ్చితమైన షెడ్యూల్‌ లేకపోవడమే ఆ జట్టు ఆటగాళ్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణమన్నాడు సంగక్కరు. మరోవైపు లంక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు జయవర్దనే. కొందరు ఆటగాళ్లను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నా.. ఫ్రాంఛైజీల అవసరాలకు తగ్గట్లు వారు లేరన్నాడు. విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో తక్కువ మందిని మాత్రమే తీసుకునే వీలుందని, అందులోనూ ఫాస్ట్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లవైపే ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పాడు. ఈ విభాగాల్లో లంక ఆటగాళ్లు వెనుకబడ్డారన్నాడు జయవర్దనే.

ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సంగక్కర కొనసాగుతుండగా.. మహేలా జయవర్దనే ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ ఉన్నాడు.