చేవెళ్లలో బీజేపీకి పోటీ లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లలో బీజేపీకి పోటీ లేదు :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకక ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీయే లేదని ధీమా వ్యక్తంచేశారు. చేవెళ్లకు మోదీ గ్యారెంటీ .. మోదీకి చేవెళ్ల గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారు.  పార్లమెంట్ ఎన్నికల కోసం చేవెళ్ల అసెంబ్లీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం సీహెచ్ఆర్​గార్డెన్ లో నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యుల పాత్ర కీలకమని, వారికి ఉన్న ప్రాధాన్యత వేరే ఇతర నేతలకు లేదన్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి అధికార పార్టీలోకి వెళ్లాడని విమర్శించారు. 

ఎంపీగా ఉన్నప్పుడే బీజాపూర్– హైదరాబాద్ హైవే తెచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణతో రోడ్డు పనులు ఆగిపోయానని, మళ్లీ గెలిచి రోడ్డును పూర్తి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్, అసెంబ్లీ కన్వీనర్ ప్రతాపరెడ్డి, జాయింట్ కన్వీనర్ సింగపురం రమేశ్, అసెంబ్లీ ప్రభారి రాజవర్ధన్ రెడ్డి, పూర్వ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి ,చేవెళ్ల ఎంపీపీ  విజయలక్ష్మి రమణారెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.