మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం : లోక్ సభలో పార్టీల బలాబలాలు

మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం : లోక్ సభలో పార్టీల బలాబలాలు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్ష పార్టీలు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ 50 మంది ఎంపీల సంతకాలతో స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. నిబంధనల ప్రకారం 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే.. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాల్సి ఉంటుంది. 

ఈ క్రమంలోనే లోక్​ సభ స్పీకర్ ఓం బిర్లా.. అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లోక్ సభలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి.. ఏ పార్టీ మద్దతు ఎవరికి ఉంది అనేది చర్చనీయాంశం అయ్యింది. 

ప్రస్తుత లోక్ సభలో బీజేపీ 303 మంది ఎంపీలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ మాత్రం 272 మాత్రమే. అవిశ్వాస తీర్మానం అనేది ఈజీగా వీగిపోయేదే అయినా.. పలు అంశాలు చర్చకు రావటం అనేది ఆసక్తిగా మారింది. విపక్ష పార్టీ తరపున చాలా పార్టీలు ఉండటంతో.. ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. 

ALSO READ :విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అంగీకారం.. బీఆర్ఎస్ కూడా ప్రత్యేక తీర్మానం


మొత్తం లోక్​ సభ సీట్లు : 543 – ఖాళీగా ఉన్న స్థానాలు 6.. ప్రస్తుత లోక్ సభలో సభ్యులు : 537

మోదీ ప్రభుత్వం బలం : 331 (లోక్​ సభ స్పీకర్ తో కలిపి)
బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ  – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2

మోదీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు :
సీఎం జగన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  – 22

విపక్ష కూటమి : ఇండియా బలం  – 142 ఎంపీలు

కాంగ్రెస్ – 50, డీఎంకే – 24, టీఎంసీ  – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే)  – 6, శరద్ పవార్  – 4, ఎస్పీ  – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్  – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1

విపక్ష కూటమి ఇండియాలో లేకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు :
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ  – 9, ఎంఐఎం 2

ఇంకా నిర్ణయించుకోని పార్టీల బలం : 31
బీజేడీ – 12, బీఎస్పీ – 9, టీడీపీ  – 3, ఎస్ఏడీ  – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, శిరోమణి అకాలీదళ్ – 1, ఇండిపెండెంట్  – 1