కరోనా ఎంటరై 4 నెలలు.. నో కంట్రోల్

కరోనా ఎంటరై 4 నెలలు.. నో కంట్రోల్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మార్చి 2న ఒక్క కేసుతో మొదలై.. ఇప్పుడు రోజుకు వెయ్యి కేసులతో కరోనా విజృంభిస్తోంది. పల్లె..పట్నం తేడా లేకుండా మహమ్మారి విస్తరిస్తోంది. టెస్టులు తక్కువ చేస్తూ, వైరస్ వ్యాప్తి లేదని పాలకులు చెప్పిన మాటలన్నీవట్టివేనని 15 రోజులుగా వస్తున్న కేసులతో జనానికి తెలుస్తోంది. రాష్ట్రంలోకి కరోనా ఎంటరై 4 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ టెస్టులకు, ట్రీట్‌‌మెంట్‌‌కు ఏడికి పోవాల్నో తెల్వని పరిస్థితి. వైరస్​ మనకు అంటితే పరిస్థితి ఏంటని జనాలు ఆందోళన చెందాల్సిన దుస్థితి. హైదరాబాద్​లో భారీగా కేసులు పెరుగుతుండటంతో జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

ఎందుకీ దుస్థితి?

కరోనాను కంట్రోల్ చేయాలంటే ‘‘టెస్టింగ్, ట్రేసింగ్‌‌, ట్రీటింగ్’’ ఒక్కటే మార్గమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఐసీఎంఆర్ వరకూ అన్ని సంస్థలు చెప్తున్నాయి. ఎక్కువ టెస్టులు చేసి, వైరస్‌‌ చైన్‌‌ను బ్రేక్ చేయాలని సూచిస్తున్నాయి. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలూ దీన్ని ఫాలో అవుతున్నాయి. మన రాష్ట్ర సర్కారు కొన్నాళ్లు ఈ పద్ధతిని ఫాలో అయింది. ఏప్రిల్ మూడో వారం నుంచి తన స్ర్టాటజీని మార్చుకుంది.

టెస్టులు తగ్గించింది..
ట్రేసింగ్‌‌ను నిర్లక్ష్యం చేసింది. వైరస్ సోకి సింప్టమ్స్‌‌ ఎక్కువగా వస్తే తప్ప ఎవరికీ టెస్ట్ చేయొద్దని నిర్ణయించుకుంది. వైరస్ సోకినా ఆరోగ్యంగానే ఉంటున్నరుగా, అలాంటప్పుడు టెస్టులు చేసుడు ఎందుకు అంటూ ఎక్కువ టెస్టులు చేయించిన ఆఫీసర్లను మందలించింది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి నిర్ణయం పైస్థాయిలోనే జరగాలని కండీషన్ పెట్టింది. దీంతో చెప్పింది చేసుడే తప్ప, గ్రౌండ్​లెవల్​లో పరిస్థితులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయలేకపోయారు. ఈ స్ర్టాటజీనే రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. దీంతో వైరస్ చాపకింద నీరులా నలుమూలలా విస్తరించింది. ఎసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమాటిక్ వ్యక్తులంతా కరోనా క్యారియర్స్​గా మారిపోయారు. వాళ్లకు తెలియకుండానే చాలా మందికి వైరస్ అంటించారు. ఈ క్రమంలో హాస్పిటళ్లకు కరోనా లక్షణాలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. మరణాలు కూడా పెరిగాయి. ప్రైమరీ కాంటాక్టులకు, డెడ్‌‌ బాడీలకు టెస్టులు చేయకుండా ఈ విషయాన్ని సర్కార్‌‌‌‌ కప్పి పుచ్చుతూ వచ్చింది. ఇంతకింతకూ రెట్టింపైన కేసులు సర్కార్ ఎంత దాచినా కరోనా దాగలేదు. రెట్టింపయింది. ప్రజలు, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో టెస్టులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో జూన్ 16 నుంచి టెస్టుల సంఖ్యను సర్కారు పెంచింది. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు అనుమతిచ్చింది. ఇప్పుడు రోజూ వెయ్యి కేసులొస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో ప్రతి ఊరుకూ పోయి టెస్టుల కోసం శాంపిల్స్ తీసుకుంటుంటే.. మన దగ్గర దవాఖాన్లకు పోయినవాళ్ల దగ్గర కూడా శాంపిల్స్ తీసుకుంటలేరు.

దవాఖాన్లు సిద్ధం కాలె
రాష్ట్రంలో వైరస్ ఎంటరై 4 నెలలవుతున్నా గాంధీ హాస్పిటల్​ తప్ప మరో ప్రభుత్వ దవాఖానలో కరోనా ట్రీట్‌‌మెంట్ స్టార్ట్ కాలేదు. వైరస్ లక్షణాలు ఎక్కువ ఉంటే ఆదిలాబాద్ పేషెంటైనా, నిజామాబాద్ పేషెంటైనా వందల కిలోమీటర్లు ప్రయాణించి గాంధీ హాస్పిటల్​కు రావాల్సిందే. కరీంనగర్‌‌‌‌, ఖమ్మం తప్ప మిగిలిన అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్‌‌ ఉన్నాయి. అయినా, ఆయా దవాఖాన్లను కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు ప్రభుత్వం రెడీ చేయలేదు. ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు అనుమతించి ప్యాకేజీలు ఫిక్స్‌‌ చేసినా.. అవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యవసరంగా పోయినోళ్లకు బెడ్లు దొరకడం లేదు. పదివేలలోపు యాక్టివ్ కేసులకే పరిస్థితి ఇట్ల ఉంటే, రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెట్ల ఉంటదోనని జనం జంకుతున్నారు.

లాక్‌‌డౌన్‌‌ ఉపయోగం ఎంత?

కేసులు పెరుగుతుండడంతో మరోసారి గ్రేటర్​ హైదరాబాద్​లో లాక్‌‌డౌన్ పెట్టాలని భావిస్తున్నట్టు సర్కార్ ఇచ్చిన లీకులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, వైరస్‌‌ ఇంతగా స్ర్పెడ్ అయ్యాక ఓ పదిహేను రోజులో, నెల రోజులో లాక్‌‌డౌన్ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని
ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు.

టెస్టింగ్‌‌, ట్రేసింగ్ సరిగాలేకే..
రాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉంది. టెస్టులను రిస్ర్టిక్ట్ చేయడం, ట్రేసింగ్ కరెక్ట్​గా చేయకపోవడం, ఫీల్డ్ లెవల్‌‌లో ఆఫీసర్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్లే ఇలా తయారైంది. ఈ టైమ్‌‌లో లాక్‌‌డౌన్ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదు. టెస్టులు ఎక్కువ చేస్తూ, ట్రేసింగ్ కరెక్ట్‌‌గా చేస్తే కేసులు ఒక్కసారిగా స్పైక్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. కేసులు వస్తున్న చోట కంటెయిన్‌‌మెంట్ స్ర్టిక్ట్‌‌గా చేయాలి.

– డాక్టర్‌‌‌‌ బుర్రి రంగారెడ్డి,
ప్రెసిడెంట్‌‌, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ

For More News..

రాగికి పూత పూసి రూ. 20 వేల కోట్ల టోపీ

పెళ్లయిన 19 రోజులకే.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి