కుంభమేళా, రంజాన్ ఫెస్టివల్‌లో కరోనా రూల్స్‌ పాటించట్లే

కుంభమేళా, రంజాన్ ఫెస్టివల్‌లో కరోనా రూల్స్‌ పాటించట్లే

న్యూఢిల్లీ: కుంభమేళాతోపాటు రంజాన్ ఫెస్టివల్‌లో చాలా మంది కొవిడ్ రూల్స్‌‌ను ఫాలో అవ్వడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశంలో సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఇలా కరోనా నియమాలను పాటించకపోవడం సరికాదని, ఇది తీవ్ర సమస్యగా మారొచ్చునన్నారు. కరోనాపై గెలిచేందుకు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ పోరాటాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ‘కుంభమేళా లేక రంజాన్ ఏదైనా కానివ్వండి.. కరోనా రూల్స్‌ను చాలా మంది సరిగ్గా పాటించట్లేదు. ఇది సరికాదు. అందుకే కుంభమేళాను లాంఛనంగా ముగించాలని కోరాం. కరోనా సెకండ్ వేవ్ త్వరగా వ్యాప్తి అవుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటం సమస్యే అని చెప్పాలి. అయితే సెకండ్ వేవ్‌పై తప్పకుండా విజయం సాధిస్తామని నమ్ముతున్నా. కరోనాపై పోరులో అన్ని రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. స్థానిక పరిస్థితులను బట్టి లాక్‌‌డౌన్ వేసే హక్కు రాష్ట్రాలకు ఉంది’ అని షా స్పష్టం చేశారు.