హత్రాస్‌‌కు వెళ్లకుండా నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు

హత్రాస్‌‌కు వెళ్లకుండా నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటంబీకులను కలవడానికి వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను ఓదార్చడానికి కొంతమంది ఎంపీలతో కలసి వెళ్లాలని రాహుల్ నిశ్చయించుకున్నారు. తనను హత్రాస్‌‌కు వెళ్లకుండా, బాధితురాలి కుటుంబీకులను కలిసి ఓదార్చనీయకుండా ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ చెప్పారు. బాధితురాలి ఫ్యామిలీతో యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాను సహించలేనన్నారు. నిజమైన భారతీయుడెవరూ దీన్ని ఆమోదించరని పేర్కొన్నారు.