ముస్లింలకు భారతదేశమే బెస్ట్ కంట్రీ: కశ్మీర్ పర్యటనలో సూఫీ బృందం

ముస్లింలకు భారతదేశమే బెస్ట్ కంట్రీ: కశ్మీర్ పర్యటనలో సూఫీ బృందం

జమ్ము కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు

అక్కడి ప్రజలకు ఏ కంప్లైంట్లు లేవు

పాక్ ప్రధాని ఇమ్రాన్ సలహాలు మాకు అక్కర్లేదు: నసీరుద్దీన్

శ్రీనగర్: ముస్లింలు నివసించేందుకు భారతదేశమే అత్యుత్తమ ప్రదేశం అని సూఫీ ముస్లిం నేత నసీరుద్దీన్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ప్రచారంపై పరిశీలనకు వెళ్లింది సూఫీ ముస్లిం బృందం. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. సోమవారం ఉదయం ఆ బృంద సభ్యుడైన నసీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు.

ఇమ్రాన్.. చైనా, పాలస్తీనాల్లో పోరాడు

జమ్ము కశ్మీర్ లో స్థానికులతో తాము మాట్లాడామని, ఎక్కడా ఒక్కరు కూడా తమకు మానవ హక్కులకు భంగం కలిగినట్లు ఫిర్యాదు చేయలేదని చెప్పారు నసీరుద్దీన్. ఫోన్ కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలను నిలుపుదల చేయడం వాస్తవమేనని చెప్పారు నసీరుద్దీన్. అయితే ఆర్టికల్ 370 రద్దు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని కఠిన చర్యలు తప్పవన్నారు.

పాకిస్థాన్ అబద్ధపు ప్రచారం చేస్తోందని అన్నారు. ముస్లింలకు భారత్ కు మించిన బెస్ట్ కంట్రీ లేదని చెప్పారాయన. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జిహాద్ కు పిలుపునివ్వడం దుర్మార్గమని అన్నారు. ముస్లింల హక్కులపై పాకిస్థాన్ కు అంత ఆసక్తి ఉంటే చైనా, పాలస్తీనాల్లో పోరాడాలని సూచించారు. భారత్, ఇక్కడి ముస్లింలకు ఇమ్రాన్ సలహాలు అక్కర్లేదని చెప్పారు నసీరుద్దీన్.