
ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు ఆందోళనలలో పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్, మోంటానా తో సహా 50 రాష్ట్రాల్లో 2వేల700 నగరాల్లో నో కింగ్స్ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. వీధుల్లో ఇసుక వేస్తే రాలనంతగా నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో, ఓషన్ బీచ్‌లో వందలాది మంది ప్రజలు శరీరంపై నో కింగ్ నినాదాలు రాసుకొని నిరసనలు తెలిపారు. ఎప్పుడూ లేనంతగా భారీ ఎత్తున అమెరికన్లు రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ నియంత అంటూ నినాదాలు చేశారు.
నిరసనలు ఎందుకు?
ట్రంప్, విధానాలు, పాలనపై అసంతృప్తిగా ఉన్న రిపబ్లికన్లు శనివారం అమెరికా వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలకు ప్లాన్ చేశారు. అమెరికాతోపాటు యూరప్ లోని కొన్ని దేశాల్లో కూడా ఈ ఆందోళనలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగులను తొలగించడం, వలసలపై దాడులు, బహిష్కరణలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో వలసలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నారు. సంస్కరణల పేరుతో ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో డాగీని ఏర్పాటు చేసిన వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేశారు. అమెరికా వ్యాప్తంగా వలసదారులపై అధికారుల సోదాలు వివాదాస్పదంగా మారాయి.
దీనిపై స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ యంత్రాంగం మోహరించడం ఆందోళనలకు మరింత పెరిగేలా చేశాయి. ట్రంప్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసనలు మొదలుపెట్టారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి పాలన సాగుతోందని , ట్రంప్ క్రూరత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు చెబుతున్నారు.
No Kings protests Huge crowds flood streets across US against Trump - Key things to know