దేశ చరిత్రలో కాళేశ్వరం లాగా కూలిపోయిన ప్రాజెక్టు లేదు : కోదండరాం

దేశ చరిత్రలో కాళేశ్వరం లాగా కూలిపోయిన ప్రాజెక్టు లేదు : కోదండరాం

దేశ చరిత్రలో కాళేశ్వరం లాగా కూలిపోయిన ప్రాజెక్టు లేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కాగ్ సూచనలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయంతో ప్రాజెక్టును నిర్మించిందని విమర్శించారు. కాలేశ్వరంలో 3 పిల్లార్లు కాదు.. 3 వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. గుండు గుత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కాంటాక్టులకు ప్రభుత్వం అప్పజెప్పారని ఆరోపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కుంగుబాటుకు బాధ్యులను గుర్తించి శిక్షించాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు కాలేశ్వరం ప్రాజెక్టు పైన అసత్య ప్రచారాలు చేసి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి కాలేశ్వరం ప్రాజెక్టుకు 80% నీళ్లు లిఫ్ట్ చేస్తామని తెలిపారు. మల్లన్న సాగర్ లో 20 టీఎంసీలు నీళ్లు నింపితే ...5 లక్షల మంది ప్రాణాలకు అపాయం ఉంటుందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన విచారణ జరగకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదని సూచించారు. కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు పక్కన పెట్టారని ఆరోపించారు. అంతర్జాతీయ నిపుణుల సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరారు. ఒక డ్యామ్ పేరుతో డబ్బులు దోచుకున్నారని కోదండరాం ఆరోపించారు.