అవన్నీ గాలి మాటలే.. దేవరపై ఈ రూమర్స్ ఎందుకు?

అవన్నీ గాలి మాటలే.. దేవరపై ఈ రూమర్స్ ఎందుకు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) ప్రస్తుతం దేవర(Devara) సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే తన ఫోకస్ మొత్తం పెట్టేశారు. హై బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేవర మేకింగ్ లో ఏమాత్రం కాంప్రమైజ్ కావడంలేదు మేకర్స్.

అనుకున్న సమయానికి కాస్త లేట్ గా మొదలైనా.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్ లో జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఎన్టీఆర్ లుక్ ఆడియన్స్ తెగ ఆకట్టుకొంది. ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. దేవర సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో రానున్న అందరికి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ తిమింగలంతో ఫైట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకె హైలెట్ గా నిలువనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దేవర సినిమాలో అలాంటి ఎపిసోడ్స్ ఏం లేవట. అవన్నీ ఉట్టి గాలిమాటలే అని.. అధికారిక ప్రకటన వచ్చేవరకు అలాంటి న్యూస్ నమ్మొద్దని టీమ్ నుండి సమాచారం. దీంతో గత వారం రోజులుగా దేవర సినిమా గురించి వినిపిస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది  ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.