నోకియా కీలక మార్పులు.. 60 ఏండ్లలో తొలిసారి

నోకియా కీలక మార్పులు.. 60 ఏండ్లలో తొలిసారి

నోకియా సంస్థ మార్కెట్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త కొత్త మొబైల్స్ తీసుకురావడంతో పాటు తాజాగా కీలక మార్పు చేసింది. 60 ఏళ్లలో మొదటి సారి తన ఐకానిక్ నోకియా లోగోను మార్చింది. దీనికి సంబంధించిన వార్తను సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ బిజినెస్ వ్యూహం ద్వారా తన బ్రాండ్ ని మరింత విస్తరించి, కొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. 

సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన నోకియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్ మార్క్ తన బిజినెస్ ప్లాన్ ను ప్రకటించాడు. నోకియా ఇకపై స్మార్ట్ ఫోన్ కంపెనీ కాదని, టెక్నాలజీ రంగంలోకి కూడా అడుగు పెడుతుందని తెలిపాడు. బిజినెస్ టు బిజినెస్ ఇన్నోవేషన్ గా ఎదుగుతుందని, దాని ప్రకారమే కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్లతో నోకియా పదాన్ని రూపొందించినట్లు వివరించాడు.