కుల పత్రాల్లేక సంచార జాతులకు అన్యాయం :  డాక్టర్ తిప్పిరిశెట్టి శ్రీనివాస్

కుల పత్రాల్లేక సంచార జాతులకు అన్యాయం :  డాక్టర్ తిప్పిరిశెట్టి శ్రీనివాస్
  • కేంద్రం నిధులు వృథా అవుతున్నయి
  • సంచార జాతుల సంఘం ఆవేదన

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంచార జాతి ప్రజలకు డీఎన్టీ కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ‘సీడ్’ పథకం నిధులు అందడం లేదని, దీనివల్ల కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయని తెలంగాణ సంచార జాతుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ తిప్పిరిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార జాతుల జీవన పరిస్థితులు, కుల సర్టిఫికెట్ల అవసరంపై బీసీ కమిషన్ ఇప్పటికే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, దానిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సంచార జాతుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్ తో పాటు రవీందర్, శివకుమార్, సమ్మయ్య పాల్గొన్నారు.