పద్మ అవార్డులపై కేంద్రం ప్రకటన

పద్మ అవార్డులపై కేంద్రం ప్రకటన

పద్మ అవార్డులు – 2023 కోసం ఆన్ లైన్ లో సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు, సిఫార్సులు సమర్పించవచ్చని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ లో (https:// awards.gov.in) నామినేషన్లు, సిఫార్సులు నమోదు చేయాలని ప్రజలకు సూచించింది.

మోడీ ప్రభుత్వం పద్మ అవార్డుల పేరును పీపుల్స్ పద్మ అవార్డులుగా మార్చేందుకు కట్టుబడి ఉందని కేంద్రం తెలిపింది. సంబంధిత రంగాలు, వృత్తుల్లో ఆయా వ్యక్తులు సాధించిన విజయాలు, అందించిన సేవలు, అసాధారణ ప్రతిభను 800 పదాలకు మించకుండా వివరిస్తూ పోర్టల్ లో నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ చెప్పింది.