
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ప్రచార సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు గురువారం జరిగిన విచారణకు రసమయి, నన్నపనేని హాజరు కాలేదు. దీంతో ఇద్దరిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012 ఎన్నికలప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులోనూ విచారణ ముగిసింది.