సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్
  • పూర్తి అదనపు బాధ్యతలు  అప్పగించిన ప్రభుత్వం
  • మాతృవిభాగానికి బలరాం బదిలీ

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి సంస్థ సీఎండీగా ట్రాన్స్​కో సీఎండీ కృష్ణ భాస్కర్‌‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఆయన సింగరేణి భవన్​లో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరాం ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి బదిలీ అయ్యారు. బలరామ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన కృష్ణ భాస్కర్​కు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు. కృష్ణ భాస్కర్ ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే సీఎం స్పెషల్ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు. గతంలో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం  తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖలో  డైరెక్టర్ గా, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు. ఐఆర్ఎస్ కు చెందిన బలరాం డిసెంబర్ 2023 నుంచి సింగరేణి సంస్థ సీఎండీగా కొనసాగుతున్నారు. గత రెండేళ్లుగా సంస్థ కార్యకలాపాలను దేశ, విదేశాలకు విస్తరించడంలో బలరాం కీలక పాత్ర పోషించారు.