కేటీఆర్ ఓడిపోతడు.. మంచి క్యాండిడేట్ను పెడితే... ఎర్రబెల్లి కూడా ఖతమే : రేవంత్ రెడ్డి

కేటీఆర్ ఓడిపోతడు.. మంచి క్యాండిడేట్ను  పెడితే... ఎర్రబెల్లి కూడా ఖతమే :  రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే మంత్రులు తనకు కనపడటం లేదని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లాలో ఓడిపోతాడని రేవంత్ జోస్యం చెప్పారు.  మంచి క్యాండిడేట్ను  పెడితే... ఎర్రబెల్లి కూడా ఓడిపోతాడని అన్నారు.  కేటీఆర్ ఓడిపోకపోతే అసలు ప్రజల కోపానికి అర్థం ఉండదని రేవంత్ చెప్పుకోచ్చారు.  

సీఎం కేసీఆర్ భోళాతనం మే 17 బుధవారం రోజున జరిగిన  బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో భయటపడిందని  రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇన్ని రోజులు తన  పేరు మీద ఓట్లు పడతాయని అన్నాడని, ఇప్పుడు మీరు పని చేయకపోతే ఓట్లు రావని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెబుతున్నాడని  అన్నారు. 

అటు  పొత్తుల కోసం తనకు చాలా పార్టీల నుంచి మిస్డ్ కాల్స్  వస్తున్నాయని  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  తమ దగ్గర ఫోన్ బిల్లు కట్టే డబ్బులు ఎక్కడివని, అందుకే  మిస్డ్ కాల్ ఇస్తున్నట్టు ఉన్నారంటూ రేవంత్ అన్నారు.  కర్ణాటక సీఎం  అభ్యర్థిపై మాట్లాడిన రేవంత్ ..మే 18 వరకు మంచి రోజులు లేవని అందుకే అధిష్టానం ప్రకటించలేదన్నారు.