ఉత్తర కొరియా సంచలన నిర్ణయం.. విదేశీ శక్తుల చేతుల్లో కిమ్ చనిపోతే అణుదాడులే! ..ఏకంగా రాజ్యాంగసవరణ చేసింది

ఉత్తర కొరియా సంచలన నిర్ణయం.. విదేశీ శక్తుల చేతుల్లో కిమ్ చనిపోతే అణుదాడులే! ..ఏకంగా రాజ్యాంగసవరణ చేసింది
  • రాజ్యాంగ సవరణ చేసిన ఉత్తర కొరియా 

ప్యాంగ్యాంగ్‌‌‌‌: ఉత్తర కొరియా అణు విధానాన్ని సవరించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ విదేశీ శక్తుల చేతుల్లో చనిపోతే వెంటనే అణుదాడులు ప్రారంభమయ్యేలా రాజ్యాంగ సవరణలు చేసింది. ఇటీవల ఇరాన్ అగ్రనేతలపై జరిగిన హత్యాకాండల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ప్యాంగ్యాంగ్‌‌‌‌లో మార్చి 22న జరిగిన15వ సుప్రీం పీపుల్స్ అసెంంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించినట్టు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్‌‌‌‌ఐఎస్) ఈ వివరాలను ధ్రువీకరించింది. అణు బలగాల కమాండ్- అండ్ -కంట్రోల్ వ్యవస్థపై శత్రువుల దాడి జరిగితే, ఆటోమేటిక్‌‌‌‌గా అణు దాడులు చేసేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించారని చెప్పింది.  ఇటీవల అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నేతలు హతమయ్యారు. 

ఈ ఘటనల తర్వాతే ఉత్తర కొరియా అప్రమత్తమైందని కూక్మిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రీ లాంకోవ్ తెలిపారు. ‘‘ఇరాన్ నాయకత్వాన్ని ఎంత సమర్థవంతంగా తుడిచిపెట్టారో చూశాక కిమ్ భయపడుతున్నారు. అందుకే తన భద్రత కోసం ఈ కఠిన నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు’’ అని పేర్కొన్నారు.

 మరోవైపు, దక్షిణ కొరియా సరిహద్దుల్లో కొత్త రకం లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను మోహరించాలని ఉత్తర కొరియా నిర్ణయించింది. కొత్తగా అభివృద్ధి చేసిన 155 ఎంఎం సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ -హోవిట్జర్ 37 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సరిహద్దు నుంచి కేవలం 35 మైళ్ల దూరంలోనే దక్షిణ కొరియా రాజధాని ‘సియోల్’ ఉండటంతో ఈ మోహరింపు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.