విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు టీమిండియా ప్రాక్టీస్

విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు టీమిండియా ప్రాక్టీస్

బెంగళూరు: స్వదేశంలో జరిగే విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన తొలి సెషన్‌‌‌‌లో ఫీల్డింగ్‌‌‌‌పై దృష్టి సారించింది. టోర్నీలో టాప్‌‌‌‌ జట్లను ఎదుర్కోవాలంటే ఇండియా చాలా మెరుగుపడాల్సి ఉంది. దాంతో ప్లేయర్లందరూ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ తరహా పాసింగ్‌‌‌‌ వార్మప్‌‌‌‌తో ప్రారంభించి తీవ్రమైన క్యాచింగ్‌‌‌‌, త్రోయింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేశారు. 

దగ్గరి నుంచి స్టంప్‌‌‌‌లను కొట్టడం, బాల్‌‌‌‌ను పిక్‌‌‌‌ చేయడం, గురి తప్పకుండా కఠినమైన త్రో వేయడం, గ్రౌండ్‌‌‌‌లో ఎక్కడి నుంచైనా వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌కు డైరెక్ట్‌‌‌‌గా బాల్‌‌‌‌ అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఫీల్డింగ్‌‌‌‌ వైఫల్యంతో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను  టీమిండియా 1–2 తేడాతో కోల్పోయింది.  ఫలితంగా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫీల్డింగ్‌‌‌‌ను బాగు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. శిబిరంలో పాల్గొన్న ప్రతి ప్లేయర్‌‌‌‌ చాలా ఉత్సాహంగా, మానసిక సంతోషంతో కనిపించారు.