ఆప్షన్ కాదు..అవసరం..భద్రతా మండలిలో మార్పులు చేయాల్సిందే..ప్రధాని మోదీ

ఆప్షన్ కాదు..అవసరం..భద్రతా మండలిలో మార్పులు చేయాల్సిందే..ప్రధాని మోదీ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం ఓ ఆప్షన్ కాదు.. అవసరం అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ పాలనా పరమైన నిర్మాణాలను సరిదిద్దేందుకు  భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు ఓ స్పష్టమైన సంకేతాలు పంపాలని ప్రధాని మోదీ కోరారు.   

IBSA శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ పాలన సమగ్రతకు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు మద్దతువ్వాలని ప్రధాని కోరారు. 

ప్రస్తుత పరిస్థితులలో భారత్, బ్రెజిల్ , సౌతాఫ్రికా ఐక్యత, సహకారంతో పంపే మేసేజ్ చాలా కీలకం అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 

యూపీఐ వంటి డిజిటల్స్ ప్రజా మౌలిక సదుపాయాలు, CoWIN వంటి ప్లాట్ ఫాంలు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్, టెక్నాలజీలో మహిళ చొరవ కోసం IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ను ప్రతిపాదించారు ప్రధాని మోదీ.  

విద్య, ఆరోగ్యం, సౌరశక్తి వంటి రంగాలల్లో దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులకు IBSA ఫండ్ సపోర్ట్ గా ఉందన్నారు ప్రధాని మోదీ. IBSAను మూడు ఖండాలు, మూడు ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించే వేదికగా అభివర్ణించారు మోదీ.  వచ్చే ఏడాది భారత్ లో జరిగే AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు IBSA నేతలను ఆహ్వానించారు. 

చిరు ధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ వైద్యం ,ఆరోగ్య భద్రతలో సహకారానికి  IBSA దేశాలు ఒకదానికొకటి అభివృద్ధి మార్గాలను పూర్తి చేసుకోగలవని ,స్థిరమైన వృద్ధికి మోడల్స్ ను అందించగవలని అన్నారు.  ఈ సమ్మిట్ లో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా  పాల్గొన్నారు.