వీడియో.. నోట్లో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ

వీడియో..  నోట్లో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ

 ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది..సెల్​ ఫోన్​ లిథియం బ్యాటరీ పేలి ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సెల్​ ఫోన్​ రిపేరింగ్ సెంటర్ కు వచ్చిన అతను అనుకోకుండా లిథియం బ్యాటరీని నోట్లో పెట్టుకొని కొరికాడు. దీంతో పెద్ద పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యువకుడి నోరు, తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 

ఓ సెల్ ఫోన్ షాపులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు  ఆ షాపులోని సిసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. నిర్లక్ష్యంగా  సెల్ ఫోన్ లిథియం బ్యాటరీని నోట్లో పెట్టుకొని కొరికినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒత్తిడికి గురైన బ్యాటరీ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. షాపులో మంటలు చెలరేగాయి. కస్టమర్లు పరుగులు పెట్టారు.ఈ ఘటనలో యువకుడి తీవ్రంగా గాయపడ్డాడు. నోరు, తల భాగంలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. 

లిథియం -అయాన్ బ్యాటరీలు సాధారణంగా స్మార్ట్‌ఫోన్లు,ఎలక్ట్రానిక్ డివైజ్ లలో అధిక శక్తి కోసం వినియోగిస్తారు. అయితే అవి లిగిపోయినా లేదా కొరికినా చాలా ప్రమాదకరమంటున్నారు టెక్ నిపుణులు. బ్యాటరీ కేసింగ్ దెబ్బతినడం వలన థర్మల్ రన్‌అవే అని పిలువబడే రసాయన ప్రతిచర్య జరిగి తీవ్రమైన వేడి, మంటలు లేదా పేలుళ్లు కూడా సంభవిస్తాయని అంటున్నారు.  యువకుడు బ్యాటరీని కొరకడంతో చర్య జరిగి పేలుడు సంభవించవచ్చంటున్నారు. 

►ALSO READ | సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి..? ఆన్‌లైన్ మోసాల నుండి మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వీడియో చూసి షాక్ అవ్వడమే కాకుండా  యువకుడి తెలివి తక్కువ తనం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర బ్యాటరీల మాదిరి కాకుండా లిథియం బ్యాటరీలు పవర్ ఫుల్ గా ఉంటాయి. వాటితో పరిహాసం ఆడొద్దంటూ సలహాలిచ్చారు.  మరికొందరు అతడు వైరల్ అయ్యేలా రీల్స్ కోసం ప్రయోగాలు చేస్తున్నాడంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

 ఈ సంఘటన లిథియం బ్యాటరీల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే జరిగే ప్రమాదాలను హైలైట్ చేసింది. ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నొక్కిచెబుతోంది.