మాస్కులు వేసుకోకుంటే కరోనాపై వ్యాసాలు రాయాలంట

మాస్కులు వేసుకోకుంటే కరోనాపై వ్యాసాలు రాయాలంట

గ్వాలియర్: కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారికి మధ్యప్రదేశ్ సర్కార్ వినూత్న శిక్ష వేయాలని నిర్ణయించింది. కరోనా రూల్స్‌‌ను అతిక్రమించిన వారిని బహిరంగ జైళ్లలో ఉంచి వారితో ఎస్సే (వ్యాసం) రాయిస్తామని గ్వాలియర్ స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. తాజాగా కరోనా రూల్స్‌‌ను ఉల్లంఘించిన సుమారు 20 మందిని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో ఉంచి కరోనా వైరస్ మీద వ్యాసం రాయించడం గమనార్హం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రోకో-టోకో క్యాంపెయిన్‌‌ను ప్రారంభించామని గ్వాలియర్ జిల్లా మేజిస్ట్రేట్ కౌష్లేంద్ర విక్రమ్ సింగ్ చెప్పారు.