లోక్ సభ ఎన్నికలు: పోలీసుల లీవ్ లు రద్దు

లోక్ సభ ఎన్నికలు: పోలీసుల లీవ్ లు రద్దు

రాష్ట్ర వ్యాప్తంగా లీవ్ లో ఉన్న పోలీసులపై ఫోకస్ పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు. చాలా మంది హోంగార్డులు, కానిస్టేబుల్లు….SI ఫైనల్ పరీక్షల కోసం లాంగ్ లీవ్ పెట్టి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే పోలీసు డిపార్టుమెంట్ లోని వివిధ విభాగాల్లో పని చేసే కానిస్టేబుల్స్ కూడా లీవ్ పెట్టి ఎస్సై పరీక్షల కోసం సెలవులు పెట్టినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల బందోబస్తులో సిబ్బంది కొరత ఏర్పడుతుందని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే పోలీసు బాసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల పూర్తయ్యే వరకు లీవ్ లను రద్దు చేశారు. కొందరైతే ఏకంగా పర్మిషన్ లేకుండానే లీవ్ లు పెట్టేశారు. లీవ్ లో ఉన్న పోలీసులందరికీ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 1 లోపు లీవ్ లో ఉన్న అధికారులంతా డ్యూటీలో చేరాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.