రాజీవ్ స్వగృహ టవర్ల వేలంకు నోటిఫికేషన్.. మొత్తం 344 ఫ్లాట్లకు 25న లాటరీ

రాజీవ్ స్వగృహ టవర్ల వేలంకు నోటిఫికేషన్.. మొత్తం 344 ఫ్లాట్లకు 25న లాటరీ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ టవర్లను గంపగుత్తగా వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ బుధవారం (సెప్టెంబర్ 10) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మేడ్చల్ జిల్లా పోచారం, గాజులరామారంలో కలిపి మొత్తం 3 టవర్లలో 344 త్రిబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ ఫ్లాట్లున్నాయి. వీటిలో ఒక్కో టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2 కోట్ల చొప్పున డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఈ నెల 24 వరకు గడువు విధించారు. 

25 న కార్పొరేషన్ అధికారులు లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. ఈ టవర్లకు సంబంధించి ఈ నెల 17న హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బిడ్డర్లతో ప్రీ బిడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌ను అధికారులు ఏర్పాటు చేశారు. పోచారంలోని సద్భావన టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఏ2 టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 120 త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు(1,470 నుంచి1,606 ఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ విస్తీర్ణం) ఉండగా రూ.29.51 కోట్ల ధరను అధికారులు ఖరారు చేశారు. 

గాజులరామారంలోని సహిరా టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బీ5 టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  112 త్రిబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఫ్లాట్లు, బీ6 టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 112 ఫ్లాట్లు.. ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ ధర రూ.1,995 ఖరారు చేయగా ఒక్కో టవర్ రూ. 26.33 కోట్లకు వేలంలో ఉంచింది.