డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 47 వేల జీతంతో ITATలో ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 47 వేల జీతంతో ITATలో ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐటీఏటీ బెంచ్‌‌‌‌‌‌‌‌ల్లో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

పోస్టు పేరు: గ్రూప్–బి గెజిటెడ్.
మొత్తం ఖాళీలు: 42.
విభాగాల వారీగా ఖాళీలు 
సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 22 (ఎస్సీ–01, ఎస్టీ–05, ఓబీసీ–04, ఈడబ్ల్యూఎస్–05, జనరల్–07).
ప్రైవేట్ సెక్రటరీ 20 (ఎస్సీ–-05, ఎస్టీ–-02, ఓబీసీ–-06, ఈడబ్ల్యూఎస్-–03, జనరల్–1-0).

ఎలిజిబిలిటీ

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
ఇంగ్లిష్ షార్ట్​హ్యాండ్‌‌‌‌‌‌‌‌లో నిమిషానికి 120 పదాల వేగం (120 డబ్ల్యూపీఎం– వర్డ్ పర్ మినట్) ఉండాలి. 
ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్, అడోబ్ పేజ్‌‌‌‌‌‌‌‌ మేకర్ వంటి సాఫ్ట్​వేర్​లను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 16. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.itat.gov.inను సందర్శించండి. 

ఎంపిక విధానం

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్/ డిస్క్రిప్టివ్ విధానంలో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ మీడియంలో పరీక్ష ఉంటుంది. పేపర్–1లో జనరల్ ఇంగ్లిష్​పై 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో కనీసం 250 పదాల ఎస్సే, లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, గ్రామర్​పై ప్రశ్నలు ఇస్తారు. 
పేపర్–2లో జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్​పై 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్/ జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట అఫైర్స్​పై ప్రశ్నలు ఇస్తారు. 

స్కిల్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 120 పదాలు, ఇంగ్లిష్  టైపింగ్​లో నిమిషానికి 45 పదాల వేగం ఉండాలి. 
కనీస అర్హత మార్కులు: రాత పరీక్ష, స్కిల్ టెస్టుల్లో కలిపి జనరల్ 50 శాతం, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
పర్సనల్ ఇంటర్వ్యూకి 75 మార్కులు కేటాయించారు. స్కిల్ టెస్ట్ తర్వాత షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.

 

►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యూనిఫాం ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు