24,369 కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ రిలీజ్​

24,369 కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ రిలీజ్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెన్త్​ అర్హతతో ఆర్మ్​డ్​ ఫోర్సెస్​లో  24,369 కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ తదితర సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​తో పాటు, ఎన్​ఐఏ, స్పెషల్​ సెక్యూరిటీ ఫోర్స్​​, అస్సాం రైఫిల్స్​లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్​(జనరల్​ డ్యూటీ) పోస్టుల రిక్రూట్​మెంట్​కు ఎస్‌‌ఎస్‌‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష నిర్వహిస్తోంది. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్: కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ ఎగ్జామ్​, ఫిజికల్​ టెస్ట్​, మెడికల్​ ఎగ్జామ్​​ ఇలా ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ టెస్ట్​ 160 మార్కులకు ఉంటుంది. 80 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. ఎగ్జామ్​ డ్యురేషన్​ 60 నిమిషాలు ఉంటుంది. జనరల్​ అభ్యర్థులకు కటాఫ్​ మార్క్స్​ 30 శాతం కాగా, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీలకు 25 శాతం, మిగతా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్​ అభ్యర్థులకు 20 శాతంగా నిర్ణయించారు.  ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: జనరల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అండ్‌‌ రీజనింగ్‌‌, జనరల్‌‌ నాలెడ్జ్‌‌ అండ్‌‌ జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌‌, ఇంగ్లిష్‌‌/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఎగ్జామ్​ డ్యురేషన్​ 60 నిమిషాలు ఉంటుంది.

సిలబస్​

జనరల్​ ఇంటెలిజెన్స్​ & రీజనింగ్​: అనాలజీ, సిమిలారిటీస్​, డిఫరెన్సెస్​, స్పేషియల్​ విజువలైజేషన్​, ఓరియెంటేషన్​, విజువల్​ మెమరీ, డిస్క్రిమినేషన్​, ఆబ్జర్వేషన్​, రిలేషన్​షిప్​ కాన్సెప్ట్​లు, అర్థమెటిక్​ రీజనింగ్, ఫిగర్​ క్లాసిఫికేషన్​, అర్థిమెటిక్​ నెంబర్​ సిరీస్​, నాన్​ వెర్బల్​ సిరీస్​, కోడింగ్​ డికోడింగ్​ల నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంది.
జనరల్​ నాలెడ్జ్​ & జనరల్​ అవేర్​నెస్​: చుట్టూ ఉన్న ఎన్విరాన్​మెంట్​, కరెంట్​ ఎఫైర్స్​తోపాటు అభ్యర్థి జనరల్​ అవేర్​నెస్​ను పరీక్షించే స్థాయి ప్రశ్నలు ఇస్తారు. భారత్​ పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫి, ఎకానమి, జనరల్​ పాలిటీ, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతికత, పరిశోధనలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్​: సంఖ్యావ్యవస్థ, పూర్ణాంకాలు, దశాంశాలు, భిన్నాలు, ప్రాథమిక గణిత ప్రక్రియలు, పర్సంటేజీలు, నిష్పత్తి అనుపాతం, లాభ నష్టాలు, వడ్డీ, డిస్కౌంట్​, కాలం–దూరం, కాలం–నిష్పత్తి, కాలం–పని తదితర బేసిక్​ గణిత అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు 4 నుంచి 10 వరకు అకడమిక్​ బుక్స్​ ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.

ఇంగ్లిష్​ /హిందీ: ఇంగ్లిష్​ లేదా హిందీ భాషలో అభ్యర్థికి ఉన్న అవగాహన స్థాయిని పరీక్షిస్తారు. బేసిక్​ కాంప్రహెన్షన్​పై ప్రశ్నలు ఉంటాయి. ​

నోటిఫికేషన్​

దరఖాస్తులు: ఆన్​లైన్​ ద్వారా అక్టోబర్​ 27 నుంచి నవంబర్​ 30 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సిపాయి పోస్టుకు రూ.18,000- నుంచి రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700- నుంచి రూ.69,100 మధ్య జీతం చెల్లిస్తారు.

ఎగ్జామ్​ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సిటీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జనవరి, 2023
వెబ్​సైట్​: పూర్తి వివరాల కోసం www.ssc.nic.in వెబ్​సైట్​ను సంప్రదించాలి. 
- వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​