
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5గా నిర్ణయించారు. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.