Mens Day 2025 : ఇవాళ మగజాతి దినోత్సవం.. ఎలా పుట్టింది.. ఎంత మందికి తెలుసు ఇలాంటి రోజు ఉందని..!

Mens Day 2025 : ఇవాళ మగజాతి దినోత్సవం.. ఎలా పుట్టింది.. ఎంత మందికి తెలుసు ఇలాంటి రోజు ఉందని..!

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నిజానికి ఆ దినోత్సవానికి తక్కువ సమయంలోనే గ్లోబల్ గుర్తింపు దక్కింది. అది మహిళల ఘనతకు నిదర్శనం. ఆకాశంలో సగంగా అభివర్ణించే వాళ్లకి ప్రత్యేకంగా ఒకరోజు ఉండటం సబబు కూడా. ఇదంతా మాకు తెలీదా? అని విసుక్కోకండి. మరి మిగతా సగమైన మగాళ్లసంగతేంటి? వాళ్లకూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలి కదా! అందుకే నవంబర్ 19న మెన్స్ డే.. ఇంటర్నేషనల్ మెన్స్.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుతున్నారు.

మెన్స్ డే ఎలా పుట్టిందంటే..!

'మనుషులందరూ సమానం' అనేది సోవియెట్ యూనియన్ ప్రాథమిక సిద్ధాంతం. కానీ.. మహిళల కోసమే ఒక ప్రత్యేక రోజు ఉండటంతో ఆ సిద్ధాంతానికి సమతుల్యం లేదని కొందరు మేధావులు. భావించారు.

మగవాళ్లకూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ప్రతిపాదించారు. అది మహిళా దినోత్సవానికి పోటీగానో లేక మహిళలకు వ్యతిరేకంగానో ఉండకూడదని తీర్మానించారు. అలా పురుషుల సమానత్వంపై తొలిసారి కదలిక మొదలైంది. కన్సాస్ లోని మిస్సోరి యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్ సమాజానికి మగవాళ్లు చేసే సేవల్ని అభినందించేందుకు ఓ దినోత్సవం అవసరం అని భావించాడు. "మానవాళి చరిత్రలో మగాళ్లు కూడా మనుషులే. అయితే వారికీ ఒక గౌరవ ప్రదమైన దినం అవసరం అనే భావన ఈ ఆధునిక యుగంలోనూ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోవడం విచారకరం" అని థామస్ తన రచనల్లో స్పష్టం చేశారు. 

చివరకు ఆయన ఆధ్వర్యంలోనే తొలిసారిగా ఫిబ్రవరి 7, 1992న మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీనిలో ఈ ఉత్సవాన్ని 1994 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుపుకుంటున్న మెన్స్ డేకి ట్రినిడాడ్, బాబాగ్ దేశస్థులు ముఖ్య కారణం. ఆ దేశంలో డాక్టర్ జెరోమా టీలక్ సింగ్ అనే వ్యక్తి అక్రమంగా జైలు వాలైన మగవాళ్ల తరపున పోరాటం చేశాడు. 

మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి అతను అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తిలక్ సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదే రోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సౌకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ నవంబర్ 19వ తేదీని మగవాళ్ల రోజుగా.. మగ జాతి దినోత్సవంగా ఆ దేశ ప్రజలు జరుపుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1999లో ఐక్య రాజ్య సమితి మెన్స్ డికి ఆమోదం తెలిపింది. 70కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే జరుపుకుంటున్నాయి. ఆ జాబితాలో భారత్ పేరు కూడా కనిపిస్తుంది.