చండీగఢ్: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఫ్రాడ్ జరిగింది. IDFC FIRST బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో సుమారు ₹590 కోట్ల భారీ మోసం జరిగినట్లు సదరు బ్యాంకు పేర్కొంది. హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాల్లో సొమ్మును బ్యాంకు ఉద్యోగులతో పాటు కొందరు బయట వ్యక్తులు కలిసి గోల్మాల్ చేశారు.
IDFC FIRST Bank Hit by ₹590 Crore Fraud
— Dr. Rakesh Bansal (@iamrakeshbansal) February 22, 2026
IDFC FIRST Bank has reported a big fraud of about ₹590 crore at its Chandigarh branch. It happened with accounts linked to the Haryana government. The issue came up when one department asked to close their account and move money, but the… pic.twitter.com/DAL29b41QZ
ఈ మోసంలో భాగస్తులుగా ఉన్న నలుగురు బ్యాంకు ఉద్యోగులను IDFC FIRST బ్యాంక్ ఉద్యోగాల నుంచి తొలగించింది. పోలీసులు ఈ మోసంపై కేసు నమోదు చేశారు. 590 కోట్ల రూపాయలంటే.. IDFC FIRST బ్యాంక్ గత త్రైమాసికంలో పేర్కొన్న ₹503 కోట్ల కంటే ఎక్కువ కావడం కొసమెరుపు. ఈ మోసంపై IDFC FIRST బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ రూ.590 కోట్ల మోసం ఎలా జరిగిందంటే..
హర్యానా ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ నుంచి IDFC FIRST బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్కు ఒక రిక్వెస్ట్ వచ్చింది. అదేంటంటే.. హర్యానా ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ను క్లోజ్ చేసి.. అందులో ఉన్న డబ్బు మొత్తాన్ని మరో బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయమని హర్యానా ప్రభుత్వ సంబంధిత విభాగం నుంచి బ్యాంకుకు ఒక అభ్యర్థన వచ్చింది.
►ALSO READ | ఛీఛీ.. సిగ్గు.. సిగ్గు.. రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే !
ఈ డబ్బును బదిలీ చేసే క్రమంలో.. బ్యాంకు ఉద్యోగులు కొందరితో కలిసి ఈ 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారు. నలుగురు బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేసిన బ్యాంకు వారిని విచారించాలని నిర్ణయించింది. ఈ మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను IDFC FIRST బ్యాంక్ కోరింది.
