న్యూఢిల్లీ: ‘శీష్ మహల్(అద్దాల మేడ)’ అనే పదం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు చండీగఢ్‌లో మరో శీష్ మహల్ ఉందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం దానికి సంబంధించిన ఫొటోను బీజేపీ ఢిల్లీ యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేసింది. "కామన్ మ్యాన్‌గా ప్రచారం చేసుకున్న వ్యక్తికి సంబంధించిన మరో శీష్ మహల్. పంజాబ్ ప్రభుత్వం ఆయనకు చండీగఢ్‌లోని సెక్టార్ 2లో రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న "7-స్టార్ బంగ్లా"ను కేటాయించింది.
పంజాబ్ సూపర్ సీఎంగా పిలవబడుతున్న కేజ్రీవాల్.. మరో అద్భుతమైన, విలాస వంతమైన శీష్ మహల్ నిర్మించుకున్నారు. అంతేకాదు, పంజాబ్‌లోని ఆప్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చడంలేదు. కానీ, కేజ్రీవాల్‌కు మాత్రం వీవీఐపీ సెక్యూరిటీ ఇచ్చేందుకు100 కార్లతో కాన్వాయ్‌ను ఇచ్చింది" అని బీజేపీ విమర్శించింది.
